బుధవారం, 28 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 సెప్టెంబరు 2021 (17:36 IST)

''పుష్ప'' షూటింగ్‌లో ఇరుక్కున్న బన్నీ.. కాకినాడలో సందడి.. తేజ్ యాక్సిడెంట్‌కూ..?

పుష్ప షూటింగ్ కోసం కాకినాడ వెళ్లిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కాకినాడలో అల్లు అర్జున్ కి ఆర్మీ పేరుతో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. పుష్ప షూటింగ్ కోసం అక్కడకు వెళ్లిన ఆయన అభిమానులకు అభివాదం చేశారు. 
 
మారేడుమిల్లి అడవుల్లో పుష్ప చివరి షెడ్యూల్ ప్లాన్ చేశారు. కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సి ఉంది. ఈనెల చివరి వరకు జరగనున్న ఈ షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ పూర్తి చేయనున్నారట దర్శకుడు సుకుమార్. 
 
అయితే నేటి షెడ్యూల్ భారీ వర్షం కారణంగా వాయిదా పడినట్లు సమాచారం అందుతుంది. దీనితో టీమ్ తిరిగి కాకినాడ చేరుకున్నారట. అల్లు అర్జున్ రాక గురించి తెలుసుకున్న అభిమానులు ఆయన వాహనం చుట్టూ గుమిగూడారు. నినాదాలతో హోరెత్తించారు. తన కారు ఓపెన్ టాప్ నుండి అల్లు అర్జున్, ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. 
 
సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడి, చికిత్స తీసుకుంటున్నారు. జూబ్లీ హిల్స్ అపోలో ఆసుపత్రిలో ధరమ్ కి చికిత్స జరుగుతుండగా, పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అరవింద్, నాగబాబు వంటి కుటుంబ పెద్దలతో పాటు కుటుంబ సభ్యులందరూ ఆసుపత్రికి వెళ్ళి, ధరమ్ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీశారు. అయితే షూటింగ్ బిజీలో ఉన్న అల్లు అర్జున్ మాత్రం, హైదరాబాద్ రాలేదు.