మంగళవారం, 16 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 4 సెప్టెంబరు 2021 (19:04 IST)

స‌ముద్ర‌తీరంలో అల‌వోక‌గా ఆస‌నాలు వేస్తున్న హ‌న్సిక‌

Hansika
'దేశముదురు' సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైన హ‌న్సిక బొద్దుగా వుండేది. ఆ త‌ర్వాత కంత్రీలో మురిపించింది. ఇలా ప్ర‌భాస్‌, రామ్‌తో న‌టించిన ఆమె ఆ త‌ర్వాత త‌న బాడీ షేప్‌ను మార్చుకుంది. ఇక క‌రోనా త‌ర్వాత పూర్తి నాజూగ్గా త‌యారైంది. అప్ప‌టినుంచి సోష‌ల్‌మీడియాలో రోజువారీ వివ‌రాల‌ను తెలియ‌జేస్తుంది. తాజాగా త‌ను చాలా సెక్సీగా నాజూగ్గా వున్న ఫొటోలు పెట్టి నెటిజ‌న్ల‌ను ఫిదా చేసింది.
 
Hansika
త‌న నాజూకు కార‌ణం యోగా, స్విమ్మింగ్ అంటూ వెల్ల‌డించింది. యోగాలో ఎన్నో భంగిమ‌లు వున్నాయ‌నీ, అవ‌న్నీ ప్రాణవాయువుని ప్ర‌తి అణువు తీసుకునేలా చేస్తుంద‌ని చెబుతోంది. తాజాగా స‌ముద్ర‌తీరాన త‌న బాడీని అల‌వోక‌గా వంగిన‌ట్లు మ‌లిచిన స్టిల్‌ను పోస్ట్ చేసింది. ఇది నెటిజ‌న్ల‌ను అల‌రిస్తుంది. అంత‌లా మేము చేయ‌లేంకానీ, నీ నాజూకుకు కార‌ణం అస‌లు తిన్న‌ట్లు లేద‌ని కొంద‌రు స‌ర‌దా కామెంట్లు పెడుతున్నారు. హ‌న్సిక త‌ర‌హాలో స‌మంత‌, కీర్తిసురేశ్ కూడా ఇలా నాజూకుగా త‌యారుకావ‌డానికి త‌గు వ్యాయామాలు చేస్తున్నారు.