మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 ఆగస్టు 2021 (14:39 IST)

కోటి రూపాయలు ఇవ్వండి సారూ... సోనూ ఇచ్చిన రిప్లై ఏంటంటే?

కరోనా కష్టకాలంలో ఆపద్భాంధవుడిలా కనిపించిన సోనూ సూద్‌ని దేవుడిలా కొలిచింది దేశం యావత్తు. అడిగిన వారికి కాదనకుండా సాయం అందించారు సోనూ. దీన్ని అవకాశంగా తీసుకున్న మరి కొందరు మాకూ మీ సాయం కావాలంటూ గాళ్ ఫ్రెండ్ వెళ్లి పోయింది వెతికి పెట్టరూ అని కొందరడిగితే.. మరి కొందరు వీడియో గేమ్ కొనిపెట్టమని అడిగిన వాళ్లూ ఉన్నారు.
 
అయినా అన్నింటికీ ఓపిగ్గా సమాధానం ఇచ్చేవారు. తాజాగా మహేంద్ర దుర్గే అనే ఓ నెటిజన్.. సోనూ సార్ ఓ కోటి రూపాయలు ఉంటే ఇవ్వండి సార్ అని అడిగాడు.. దానికి సోనూ కూల్‌గా స్పందించారు. ఏం మహేంద్రా కోటి సరిపోతుందా.. కాస్త ఎక్కువ అడగొచ్చుగా అని లాఫింగ్ ఎమోజీతో పంచ్ ఇచ్చారు. సోనూ ట్వీట్ చేసిన వెంటనే మహేంద్ర ఆ ట్వీట్‌ని డిలీట్ చేశాడు.
 
ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దానికి 27 వేల మంది లైకులు కొట్టగా.. సోనూకి సాయం చేసే గుణమే కాదు, మంచి కామెడీ టైమింగ్ కూడా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.