శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 14 ఆగస్టు 2021 (12:39 IST)

పీఎంగా ధోనీ.. సీఎంగా విజయ్‌: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న ఫోటోలు

Vijay_Mahi
టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ.. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ ఒకేచోట కలిశారు. అందుకు చెన్నైలోని గోకుల్ స్టూడియో వేదికైంది. సెప్టెంబర్ 10వ తేదీ ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో.. సీఎస్కే సారధి ఎంఎస్ ధోనీ ఇటీవలే చెన్నై వెళ్లాడు. 
 
కొన్ని యాడ్స్ షూటింగ్స్ కోసం స్టూడియోకు వెళ్లిన ఎంఎస్ ధోని.., పక్కనే ఇళయ దళపతి విజయ్ బీస్ట్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకుని అక్కడికి వెళ్లి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. 
Vijay_dhoni
 
కాసేపు హీరో విజయ్‌తో ఎంఎస్ ధోనీ ముచ్చటించాడు. ఇద్దరూ కలిసి సినిమాలతో పాటు క్రికెట్ కబుర్లు చెప్పుకున్నారు. ప్రస్తుతం ఆ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.