సోమవారం, 23 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 ఆగస్టు 2021 (16:56 IST)

ధోనీ ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్ అవుట్.. మహీకి షాక్

టీమిండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్… మహేంద్ర సింగ్ ధోనికి దిగ్గజ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మహేంద్రసింగ్ ధోని అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్‌ను తొలగించింది ట్విట్టర్. మహేంద్ర సింగ్ ధోని తన ట్విట్టర్‌ను ఎక్కువ రోజుల వాడటం లేదని అంటే యాక్టివ్‌గా అకౌంటు లేదని వెల్లడించింది ట్విట్టర్.
 
ఈ కారణంగానే ధోనీ ట్విట్టర్ ఖాతా నుండి బ్లూ టిక్ తొలగించబడిందని స్పష్టం చేసింది ట్విట్టర్. మహేంద్రసింగ్ ధోనీ చివరి సారిగా 2021 జనవరి 8 న ట్వీట్ చేశారని కూడా తెలిపింది. అంతేకాదు 2018 నుండి మహేంద్రసింగ్ ధోని ట్విట్టర్‌లో చాలా తక్కువ ట్వీట్ చేస్తున్నాడని… అసలు ట్విట్టర్ ఖాతా ను వాడటం లేదని స్పష్టం చేసింది. 
 
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ధోనికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్ నుంచి తొలగించామని క్లారిటీ ఇచ్చింది. కాగా 2 రెండు నెలల క్రితం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అకౌంటు బ్ల్యూ టిక్ ను తొలగించింది ట్విటర్.