శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 ఆగస్టు 2021 (12:41 IST)

పాకిస్థాన్ అసాధారణ నిర్ణయం.. అద్దెకు ప్రధాని అధికారిక నివాసం

పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుంది. కరోనా కష్టాలతో పాటు.. దేశ ఆర్థిక వ్యవస్థ బాగా క్షీణించింది. దీంతో ఆ దేశ పాలకులు అసాధారణ నిర్ణయాన్ని తీసుకున్నారు. దేశ ప్రధానమంత్రి అధికారిక నివసాన్ని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. తద్వారా వచ్చే ఆదాయంతో కాస్తోకూస్తో ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని భావిస్తున్నారు. 
 
గత కొన్ని రోజులుగా పాకిస్థాన్ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ, అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఒక్కపైసా కూడా అప్పు ఇచ్చేందుకు ఏ ఒక్క దేశం ముందుకురాలేదు. దీంతో పాకిస్థాన్ ప్రభుత్వం.. అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఏకంగా ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్నే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది దేశంలో సంచలనంగా మారింది.