అత్యాచారాలకు పాల్పడితే వృషణాలను తొలగించండి... ఇమ్రాన్ ఖాన్  
                                       
                  
				  				   
				   
                  				  అత్యాచారాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు విధించాలని పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ కోరారు. ముఖ్యంగా, రేపిస్టులపై ఫస్ట్ డిగ్రీలోభాగంగా వృషణాలను తొలగించాలని ఆయన సూచించారు. 
				  											
																													
									  
	 
	ఇటవల లాహోర్ హైవేపై ఓ మహిళపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేశారు. తన ఇద్దరు పిల్లలతో కలిసి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్న మహిళను ఇద్దరు గన్‌పాయింట్‌లో బెదిరించి అత్యాచారం చేశారు. ఈ ఘటన పాకిస్థాన్‌లో పెను సంచలనం రేపింది. నిందితులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ వచ్చింది. 
				  
	 
	దీంతో ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. అత్యాచార కేసులో దోషిగా తేలిన వారిని బహిరంగంగా ఉరి తీయాలన్నారు. లేదంటే  రసాయనిక పద్ధతిలో రేప్‌కు పాల్పడినవారి వృషణాలు పనిచేయకుండా చేయాలని సూచించారు. వాస్తవానికి బహిరంగంగా ఉరి తీయాలని ఆదేశం ఉన్నా.. పాకిస్థాన్ ఆ చర్యలకు పాల్పడలేదని, ఎందుకంటే అలా చేస్తే యూరోపియన్ యూనియన్ తమ వాణిజ్య సంబంధాలను తెంచుకుంటుందన్నారు. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	ఈ నేపథ్యంలో కెమికల్ క్యాస్ట్రేషన్ పద్ధతికి తాను మెగ్గుచూపుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. హత్యల్లో ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థార్డ్ డిగ్రీ ఉన్నట్లే.. రేప్‌కు పాల్పడిన వారికి ఫస్ట్ డిగ్రీలో భాగంగా వారి వృషణాలను తొలగించాలన్న సూచన చేశారు.