శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 5 ఆగస్టు 2021 (18:06 IST)

అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఆచార్య యార్లగడ్డ పదవీ కాలం పొడిగింపు

అధికార భాషా సంఘం అధ్యక్షునిగా ఆచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ పదవీ కాలాన్ని మరో రెండు సంవత్సరాలు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత రెండు సంవత్సరాలుగా ఈ పదవిలో యార్లగడ్డ కొనసాగుతుండగా, 2023 ఆగస్టు 25 వరకు ఆయన పదవిలో ఉండనున్నారు.
 
క్యాబినేట్ హోదాతో పాటు అమాత్యులకు వర్తించే జీతభత్యాలు, సదుపాయాలు వర్తిస్తాయని పర్యాటక, భాషాసాంస్కృతిక, క్రీడా, యువజనాభ్యుదయ శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ గురువారం ఉత్తర్వులు జారీ చేసారు.