1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Pakistan fragmenting; Balochistan declares independence?

ముక్కలవుతున్న పాకిస్తాన్, స్వతంత్రం ప్రకటించుకున్న బెలూచిస్తాన్?

Balochistan
పాకిస్తాన్ దేశం రెండు ముక్కలవబోతోంది. ఆ దేశంలోని బెలూచిస్తాన్ ప్రాంత ప్రజలు ఎన్నో ఏళ్లుగా తాము పాకిస్తాన్ దేశం నుంచి విడిపోతామని ఆందోళన చేస్తున్నారు. బలూచ్ ప్రాంతంలో వున్న అమూల్యమైన ఖనిజ సంపదనంతా పాకిస్తాన్ ప్రభుత్వం దోచుకెళ్లి బలూచ్ ప్రజలకు మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని వారు ఆందోళనలు చేస్తున్నారు. మా సంపదను దోచుకుని మమ్మల్ని అభివృద్ధికి ఆమడదూరంలో పెడతారా అంటూ వారు నిరసిస్తున్నారు. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వం బెలూచిస్తాన్ కోసం పోరాడుతున్నవారిని అణచివేస్తూనే వుంది.
 
కానీ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అక్కడి ప్రజలు పాక్ సైన్యంతో పోరాడుతున్నారు. ఈ పోరాటం కాస్తా చివరి దశకు వచ్చిందని చెబుతున్నారు. తాజాగా బెలూచిస్తాన్ ఉద్యమ నాయకులు తమ బెలూచిస్తాన్ దేశాన్ని స్వతంత్ర దేశంగా ఆగస్టు 11న ప్రకటించుకుంటున్నట్లు బోర్డులు పెట్టారు. సోషల్ మీడియాలో సందేశాలు పంపుతున్నారు. దీనితో పాకిస్తాన్ అప్రమత్తమైంది. బలూచ్ ప్రాంత ప్రజలను ఎలాగైనా దారిలోకి తెచ్చుకోవాలని యత్నిస్తోంది. ఐతే అందుకు బలూచిస్తాన్ ఉద్యమ నాయకులు మాత్రం ససేమిరా అంటున్నట్లు సమాచారం. 
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
Cow: ఆవును ఢీకొన్న రైలు.. ఆవుకు ఏమైందంటే? (video)