మైనింగ్ కాంప్లెక్స్‌లో పేలుడు.. 18మంది బొగ్గు గని కార్మికులు మృతి
Pakistan Coal Mine
పేలుడు జరిగిన సమయంలో కాంప్లెక్స్‌లోని కూలిపోయిన భాగంలో 36 మంది ఉన్నారని బలూచిస్థాన్ గనులు మరియు ఖనిజాల అభివృద్ధి శాఖ మంత్రి షోయబ్ నోషెర్వానీ చెప్పారు. వారిలో 25 మంది గురువారం రాత్రి వరకు ఆచూకీ లేకుండా పోయారని ఆయన తెలిపారు.
భూమికి 4,000 అడుగుల (1,219 మీటర్ల) లోతులో సహాయక చర్యలు జరుగుతున్నాయని ఆ ప్రావిన్స్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ మైన్స్ ముహమ్మద్ అతిఫ్ చెప్పారు.
