1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Pakistan Bike Rider Viral Video

పాకిస్థాన్ : బైక్ మీద పదిమంది ప్రయాణం.. వీడియో వైరల్

Pakistan Bike Rider
Pakistan Bike Rider
పాకిస్థాన్ దేశంలో రోడ్లు సరిగా వుండవు. పాకిస్తాన్ దేశంలో ట్రాఫిక్ నిబంధనలు పెద్దగా ఉండవు. కరాచీ, ఇస్లామాబాద్, పెషావర్ వంటి ప్రాంతాలను మినహాయిస్తే మిగతా చోట్ల దారుణంగా ఉంటుంది పరిస్థితి. పాకిస్తాన్ దేశంలో ఒక్కో ద్విచక్ర వాహనం మీద ముగ్గురు లేదా నలుగురు.. కొన్ని సందర్భాల్లో అంతకుమించిన జనం కూర్చుంటారు. 
 
ప్రమాదకరమైన పరిస్థితుల్లో ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తాజాగా పాకిస్తాన్ దేశంలో ఒక వీధిలో అత్యంత ప్రమాదకరమైన రీతిలో బైక్ మీద పదిమంది ప్రయాణిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.
 
సాధారణంగా ఒక ద్విచక్ర వాహనం మీద ఇద్దరు ప్రయాణిస్తారు. కానీ ఆ బైక్ మీద ముగ్గురు మహిళలు.. వారి చేతులలో మరో ఆరుగురు పిల్లలు.. మొత్తం పది మంది కూర్చోవడంతో చూసేవాళ్ళు విస్తు పోయారు. పాకిస్తాన్‌లో ఇది కామన్ అయినప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా ఈ వీడియో వెలుగులోకి రావడంతో.. చూసే నెటిజన్లకు దిమ్మ తిరిగిపోయింది. 
 
ఈ బండి నడుపుతున్న వ్యక్తి ఏకంగా ఫ్యూయల్ ట్యాంక్ మీద కూర్చొని డ్రైవింగ్ చేస్తూ ఉండటం విశేషం. ప్రాణాలు తెగించి వారు చేస్తున్న ఈ ప్రయాణంపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ భవనంలో కుప్పకూలిన మెట్లు (వీడియో)