సంబంధిత వార్తలు
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ భవనంలో కుప్పకూలిన మెట్లు (వీడియో)
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ భవనంలో నాసికరకం ఇంజనీరింగ్ పనులు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఈ భవనంలో నిర్మించిన మెట్లు నాసికరకం పనుల కారణంగా కూలిపోయాయి. ఈ ఘటన జరిగినపుడు ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మేయర్ మహంత్ గిరీష్ త్రిపాఠి అక్కడే ఉన్నట్టు సమాచారం. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఈ భవనంలో నిర్వహించిన ఓ మీటింగ్‌లో పాల్గొనేందుకు కోచింగ్, లైబ్రరీ ఆపరేటర్లు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే మెట్లు కుప్పుకూలిపోయాయి. దీంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. దీనిపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. డబుల్ ఇంజిన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. బీజేపీ చెప్పిన వికాస్ ఇదేనా అంటూ జనం మండిపడుతున్నారు. అయోధ్య నిర్మాణ పనుల్లో నాసికరకం పనులు చోటు చేసుకున్నట్టు వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ఈ వార్తలకు బలం చేకూర్చుతోంది.
అయోధ్యలో బయటపడ్డ మరో ఇంజినీరింగ్ మార్వెల్
— PulseNewsBreaking (@pulsenewsbreak) July 6, 2026
అయోధ్య డెవలప్‌మెంట్ అథారిటీ (ADA) భవనంలో కుప్పకూలిన మెట్లు
ఈ ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్యే వేద్ ప్రకాశ్ గుప్తా, మేయర్ మహంత్ గిరిష్ త్రిపాఠి అక్కడే ఉన్నారని సమాచారం
అయితే.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న జనం
ఈ భవనంలో… pic.twitter.com/IU0ozGmPNj
