1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Sri Lanka Prison Riot Kills 25, Wounds More Than 100

శ్రీలంక నెగోంబో జైలులో అల్లర్లు... 25కి చేరిన ఖైదీల సంఖ్య

jail
శ్రీలంక దేశంలోని నెగోంబో పట్టణంలో ఉన్న జైలులో అల్లర్లు చోటుచేసుకున్నాయి. ఈ అల్లర్ల కారణంగా చనిపోయిన ఖైదీల సంఖ్య 25కి చేరింది. మృతుల్లో ఖైదీలతో పాటు నలుగురు గార్డులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన మరో వంద మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. గత ఐదేళ్లలో దేశంలోని జైళ్లలో జరిగిన అత్యంత దారుణమైన అల్లర్లు ఇవేనని వారు పేర్కొన్నారు. జైలులో మాదక ద్రవ్యాల వ్యవహారంలో ఆదివారం సాయంత్రం రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగినట్లు తెలిపారు. సామర్థ్యానికి మించి కారాగారంలో వేలాదిమంది ఖైదీలు ఉండడం వల్ల ఈ ఘటన మరింత తీవ్రమయ్యిందన్నారు. 
 
జైలు అంతటా ఘర్షణల వార్తలు వ్యాపించడంతో పక్కనే ఉన్న విభాగంలోని మహిళా ఖైదీలు తమను విడుదల చేయాలని ఆదివారం రాత్రి పైకప్పుపైకి ఎక్కి నిరసన చేపట్టారు. అదేసమయంలో పైకప్పులో కొంత భాగం కూలిపోవడంతో పలువురు గాయాలపాలయ్యారు. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని అధికారులు వెల్లడించారు. జైలులో పరిస్థితిని పర్యవేక్షించడానికి డ్రోన్‌లు, ఓ హెలికాప్టర్‌ను మోహరించామన్నారు. ఘటన గురించి తెలుసుకున్న ఖైదీల బంధువులు సోమవారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో జైలు వెలుపల గుమిగూడి, తమ వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 
 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి