సంబంధిత వార్తలు
- జూలై 5, 2026 నాటి తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుంటుందంటే?
- Revanth Reddy 20 Years: మిడ్జిల్ ప్రజలు నాటిన మొక్క.. మహా వృక్షమైంది.. రేవంతన్న (video)
- బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- బండి భగీరథ్ బెయిల్ పిటిషన్: జూలై 8కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
- 12 రోజుల క్రితం అపహరణకు గురైన మూడేళ్ల బాలుడి గుర్తింపు
కన్నతండ్రే కాల యముడయ్యాడు.... కన్నకొడుకును కొట్టి చంపేసిన తండ్రి.. ఎక్కడ?
కన్నతండ్రే కాలయముడయ్యాడు. తన కొడుకును ఓ కసాయితండ్రి కొట్టి చంపేశాడు. పొడవాటి కత్తితో తల వెనుక భాగంలో కొట్టడంతో ఆ బిడ్డ చనిపోయాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణం, అంబేద్కర్ నగర్‌లో చోటుచేసుకుది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
అంబేడ్కర్‌నగర్‌లో నివాసం ఉంటున్న నిందితుడు కొత్తపల్లి సీతారాములు(ఆటోడ్రైవర్), అతని కుమారుడు కిరణ్‌కుమార్(35) (పెయింటర్)కు మధ్య తాము నివాసం ఉంటున్న ఇంటి అమ్మకం విషయంలో మూడు నెలలుగా వివాదం నడుస్తోంది. తాము నివాసం ఉంటున్న ఇంటిని అమ్మేందుకు సీతారాములు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యులు అంగీకరించలేదు.
ఈ నేపథ్యంలో సీతారాములు కుమార్తె ఝాన్సీరాణి కల్లూరు సీహెచ్‌సీ వైద్యశాలలో ప్రసవించడంతో కిరణ్‌కుమార్ తల్లి, భార్యాపిల్లలు ఆమె వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు. మేనకోడలు పుట్టిందన్న ఆనందంతో తండ్రీ కొడుకులు మద్యం తాగారు. ఆ సమయంలో ఇంట్లో వారిద్దరే ఉన్నారు. ఆ మత్తులో ఇంటి అమ్మకం విషయంపై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. దీంతో సీతారాములు కుమారుడి తల వెనుక భాగంలో పొడవాటి కత్తితో గట్టిగా కొట్టాడు.
ఇంటి సమీపంలోని వారు ఇంట్లో ఏవో అరుపులు వినిపిస్తున్నాయని వైద్యశాలలో ఉన్న వారి కుటుంబ సభ్యులకు చరవాణిలో తెలిపారు. దీంతో కిరణ్‌కుమార్ భార్య విజయజ్యోతి ఇంటికి చేరుకుని చూడగా కిరణ్‌కుమార్ తలకు తీవ్ర గాయమై రక్తపుమడుగులో పడి ఉండటంతో స్థానికుల సహకారంతో సీహెచ్‌సీకి తరలించారు. అనంతరం తలకు ఈసీజీ కోసం పెనుబల్లి సీహెచ్‌సీకి తరలించగా అప్పటికే కిరణ్‌కుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై శనివారం ఉదయం విజయజ్యోతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. నిందితుడు సీతారాములు తన ఆటోలో పారిపోగా మూడు పోలీసు బృందాలతో వెతుకుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తండ్రే కుమారుడిని హతమార్చడంతో అంబేడ్కర్‌నగర్‌లో విషాదఛాయలు అలముకొన్నాయి.
