భార్యాభర్తలు చంపుకోవడం ఫ్యాషన్.. మేడ మీద నుంచి తోసేసి.. నరాల్లో హార్పిక్ ఎక్కించి..?
Crime News
వివాహేతర సంబంధానికి అడ్డుగా వున్న తన భర్తను పక్కాగా స్కెచ్ వేసి.. టాయిలెట్ క్లీనర్‌గా వాడే హార్పిక్ లిక్విడ్‌ను ఇంజెక్షన్ ద్వారా భర్త నరాల్లోకి ఎక్కించి చంపేసింది. వివరాల్లోకి వెళితే.. న్యాల్కల్‌కు చెందిన ప్రశాంత్ భార్య సంధ్యకు, అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం వుంది. ఇటీవలే ప్రశాంత్ గల్ఫ్ నుంచి తిరిగి రావడం.. అతడు భార్య వివాహేతర సంబంధాన్ని ప్రశ్నించడం జరిగిపోయాయి.
అంతే బంటి అనే ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు సంధ్య అంతా చేసింది. దీంతో సంధ్య భర్తకు బాగా మద్యం తాగించి మేడపై నుంచి ప్రియుడితో కలిసి తోసేసింది. వెంటనే అతనిని ఏమీ తెలియనట్లు ఆస్పత్రి తరలించి డ్రామా చేసింది. కానీ ప్రాణం పోకపోవడంతో అతని నరాల్లో ఆస్పత్రిలో హార్పిక్ ఎక్కించింది.
అయితే పోలీసుల విచారణలో అసలు రంగు బయటపడింది. భార్యే హంతకురాలని తేలింది. బంటి పోలీసుల ముందు నేరాన్ని అంగీకరించడంతో అసలు సంగతి బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
