1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Samantha goes for maternity leave, plans comeback in 2027-28

బాంద్రా: నల్లటి దుస్తుల్లో సమంత.. 2027-28లో మళ్లీ రీ ఎంట్రీ? (video)

Samantha
Samantha
సమంత రూత్ ప్రభు త్వరలో తల్లి కాబోతున్నారు. బాంద్రాలోని తన నివాసం నుండి బయటకు వస్తుండగా ఆమె కెమెరాకు కనిపించారు. నల్లని దుస్తులలో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఆమె వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
సమంత ముఖం ప్రకాశంగా వెలిగిపోతుందని అభిమానులు అంటున్నారు. ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. ప్రస్తుతం సోషల్ మీడియా ఆమెపై ప్రేమ, ప్రశంసల వెల్లువతో నిండిపోయింది.
 
ఇక సినిమాల విషయానిరి వస్తే సమంత చివరిగా 'మా ఇంటి బంగారం' చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం థియేటర్లలో మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. చిత్ర నిర్మాతల ప్రకారం ఈ సినిమా రూ. 100 కోట్ల వసూళ్లను సాధించిందని తెలుస్తోంది. 
 
తన గర్భధారణ విషయం నిర్ధారణ కాకముందే, సమంత ఒక ఓటీటీ ప్లాట్‌ఫారమ్ కోసం టాక్ షో చేయడానికి అంగీకరించింది. ఆ ఒక్క బాధ్యత తప్ప, ఆమె మరే ఇతర కొత్త నటనా ప్రాజెక్టులను చేపట్టకూడదని నిర్ణయించుకుని, ఏడాది పాటు ప్రసూతి విరామం తీసుకోవాలని భావిస్తోంది.
 
ఇంకా తన నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ ఆధ్వర్యంలోని ప్రాజెక్టుల పర్యవేక్షణను కొనసాగించాలని ఆమె యోచిస్తున్నప్పటికీ, కెమెరా ముందుకు తిరిగి వచ్చే తక్షణ ప్రణాళికలేవీ ఆమెకు లేవు. ఆమె ఎప్పటి నుంచో ఆశించిన మాతృత్వాన్ని పూర్తిగా ఆస్వాదించాలనుకుంటున్నందున, నటనకు సమంత ప్రస్తుతం ప్రాధాన్యత తగ్గించనున్నట్లు సమాచారం. 
 
అయితే, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది కేవలం తాత్కాలిక విరామం మాత్రమేనని, ఆ విరామం తర్వాత తిరిగి నటనలోకి వస్తానని సమంత స్పష్టం చేసింది. అంతా అనుకున్నట్లుగా జరిగితే, 2027 లేదా 2028లో ఆమె తదుపరి సినీ ప్రస్థానం మొదలయ్యే అవకాశం ఉంది.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
NTR injured : డ్రాగన్ షూటింగ్ లో ఎన్.టి.ఆర్. భుజానికి గాయం -నెలపాటు రెస్ట్