సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (14:47 IST)

చేపలను తింటున్న మేక.. వీడియో వైరల్

Goat
ప్రతిరోజూ ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలలో కొన్ని ఫన్నీ వీడియోలు, కొన్ని వీడియోలు నమ్మశక్యం కానివి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం చర్చలో ఉంది. మేక తరచుగా గడ్డి తినడం మీరు చూసి వుంటారు. అయితే, మాంసాహారం తినే మేకను మీరు ఎప్పుడైనా చూశారా?
 
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో మీరు మాంసాహార మేకను చూడవచ్చు. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. ఈ వీడియో చాలా సరదాగా ఉంది. 
 
ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు తమ కళ్లను నమ్మలేరు. ఒక మేక దాని ముందు బుట్టలో నుండి చేపలు తింటున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. మేక చాలా హాయిగా చేపలు తినడం కనిపిస్తుంది.ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియోను వేలాది సార్లు వీక్షించారు.