గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (11:34 IST)

పూజ కోసం ఆలయం ముందు పార్క్ చేసిన బుల్లెట్ బండి పేలిపోయింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో రాయల్ ఎన్‌ఫీల్డ్ (బుల్లెట్ బైక్) ఉన్నట్టు పేలిపోయింది. అదీ కూడా ఇది కొత్త బైకు. అపుడే షోరూమ్ నుంచి డెలివరీ చేసుకుని పూజ చేసేందుకు ఆలయం ముందు బైకర్ పార్క్ చేసివుంచాడు. అపుడు ఒక్కసారిగా ఆ బుల్లెట్ బండి నుంచి మంటలు చెలరేగి పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో భారీ మంటలు చెలరేగడంతో భక్తులు, స్థానికులు భయంతో పరుగులు తీశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. కర్ణాటకలోని మైసూర్‌కు చెందిన రవిచంద్ర అనే వ్యక్తి బైక్‌కు పూజ నిర్వహించడానికి కసాపురం ఆంజనేయ స్వామి ఆలయానికి తీసుకొచ్చాడు. దాన్ని ఆలయం ముందు పార్క్ చేసివుంచగా, బైక్‌లో అనూహ్యంగా మంటలు చెలరేగి పేలిపోయింది. దీంతో అక్కడికక్కడే ఉన్న భక్తులు ఇతర వాహనాలకు మంటలు అంటుకోకుండా మంటలను ఆర్పివేశారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తూ వీక్షకులను భయాందోళనకు గురిచేస్తోంది.