శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (16:23 IST)

పాకిస్థాన్‌లో భారీ పేలుడు - 30 మంది మృతి

దాయాది దేశం పాకిస్థాన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. ఓ మసీదు వద్ద ఇది జరిగింది. శుక్రవారం కావడంతో ప్రార్థనల కోసం మసీదుకు అనేకమంది వచ్చారు. ఆ సమయంలో ఈ పేలుడు సంభవించడంతో 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. 
 
వాయువ్య పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో కొచా రిసల్దార్ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. ప్రార్థనల సమయంలో ఈ పేలుడు సంభవించడంతో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. 
 
ఈ పేలుళ్ళపై పోలీస్ అధికారి మహ్మద్ సజ్జాద్ ఖాన్ మాట్లాడుతూ, పేలుడు సంభించిన మసీదు, పరిసర ప్రాంతాల్లో అనేక మార్కెట్లు ఉన్నాయని, సాధారణంగా శుక్రవారం ప్రార్థనల సమంయలో రద్దీగా ఉండటంతో ప్రాణనష్టం మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మరోవైపు పేలుడు సమయంలో కాల్పులు కూడా వినిపించాయని కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.