మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (12:02 IST)

రోడ్డు విస్త‌ర‌ణ‌లో మ‌సీదు వివాదం... జోక్యం చేసుకున్న అవినాష్

విజ‌య‌వాడ‌లోని రోడ్డు విస్త‌ర‌ణ‌లో ఒక మ‌సీదు అడ్డు ఉంద‌ని అధికారులు తొలగించే ప్ర‌య‌త్నం చేయగా, వైసీపీ యువ‌నేత దేవినేష్ అవినాష్ అడ్డుప‌డ్డారు. మ‌త‌పెద్ద‌లు చెప్పిన విన‌తిపై స్పందించి, మైనారిటీ మంత్రి అంజాద్ భాషాతో చ‌ర్చించారు. 
 
 
స్థానిక ఏపీఐఐసీ కాలనీలో రోడ్డు విస్తరణ కారణంగా అక్కడ ఉన్న మసీదు తొలగిస్తున్నారని మత పెద్దలు దేవినేని అవినాష్ దృష్టికి తీసుకురాగా, దానిపై విఎంసి కమిషనర్ తో అవినాష్ మాట్లాడారు. చివ‌రికి మ‌సీదు తొల‌గిస్తే, అందుకు ప్రత్యామ్నాయంగా మరొక చోట కొత్త మసీదు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని క‌మిష‌న‌ర్ హామీ ఇచ్చారు. దీనితో దేవినేని అవినాష్, మసీదు కమిటీ సభ్యులతో  కలిసి స్థల పరిశీలన చేశారు. 
 
 
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని కులాలు, మతాలకు సమ ప్రాధాన్యం ఇచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని, ఎవరికి అన్యాయం జరగదు అని  దేవినేని అవినాష్ చెప్పారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఆసిఫ్ 4వ డివిజన్ ఇంచార్జ్ గల్లా పద్మావతీ, మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, మసీదు కమిటీ అసిఫ్, అభీద్ ఖాన్, గౌస్, చోటు, రిజ్వన్, కలాం తదితరులు పాల్గొన్నారు.