ఆసరాకు సీపీ కాంతి రాణా భరోసా! వినియోగదారుల హక్కుల పరిరక్షణ!!
ఆంధ్రప్రదేశ్‌లో వినియోగదారుల హక్కుల పరిరక్షణపై 'ఆసరా' సంస్థ అందిస్తున్న సేవలకు తన వంతుగా సహకారాన్ని అందిస్తానని విజయవాడ కొత్త పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా భరోసా ఇచ్చారు. వినియోగదారుల హక్కుల కోసం ప్రభుత్వపరంగా ఆసరా కల్పిస్తామని తెలిపారు.
విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన కాంతి రాణాను ఆసరా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సి.ఇ.ఓ. తరుణ్ కాకాని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అడ్వకేట్స్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్నెస్ (ఆసరా) సంస్థ తరఫున సీపీకి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. తమ సంస్థ ఆసరా కార్యాచరణ బుక్‌లెట్‌ని సీపీ కాంతి రాణా టాటాకు చూపించారు.
ఆసరా సేవలను జాతీయ స్థాయిలో ఇప్పటికే విస్తరించామని, త్వరలో లీగల్ అవేర్నెస్ మొబైల్ వ్యానులను కూడా ప్రారంభిస్తున్నట్లు ఆసరా కృష్ణా జిల్లా అధ్యక్షుడు, అమరావతి బోటింగ్ క్లబ్ సి.ఇ.ఓ. తరుణ్ కాకాని డీజీపీకి తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయపరంగా తాము చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
వినియోగదారులకు తమ హక్కులపై అవగాహన కల్పించడంతోపాటు, వారి నుంచి వచ్చే ఫిర్యాదులను సంబంధిత ఫోరమ్ లో దాఖలు చేయడం కూడా ఆసరా పని అని తరుణ్ కాకాని పేర్కొన్నారు. వివిధ జిల్లాలలో సహాయం కోరే వినియోగదారులను గుర్తించి వారికి ఆసరా కల్పిస్తున్నామని సీపీకి వివరించారు.
గతంలో విజయవాడలో డి.సి.పి.గా, జె.సి.పిగా పనిచేసినపుడు తరుణ్ కాకానితో పాటు వివిధ స్వచ్ఛంద కార్యక్రమాల్లో కాంతి రాణా పాల్గొన్న విషయాన్ని సీపీ గుర్తు చేసుకున్నారు. ఆసరా సంస్థ చేపట్టే అవగాహన కార్యక్రమాలకు తన వంతు సహకారాన్ని అందిస్తామని సీపీ రాణా హామీ ఇచ్చారు. విజయవాడలో త్వరలో లీగల్ అవేర్ నెస్ మొబైల్ వ్యాన్లను ప్రారంభించనున్నామని తరుణ్ కాకాని తెలిపారు.