గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (07:50 IST)

విశాఖపట్నం హెటెరో ఫార్మాలో భారీ పేలుడు: ఐదుగురికి తీవ్ర గాయాలు

విశాఖపట్నం నక్కపల్లిలోని హెటెరో ఫార్మా కంపెనీలో బుధవారం రియాక్టర్ పేలుడు సంభవించిన ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి.

 
గాయపడిన ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని, వారిని చికిత్స నిమిత్తం విశాఖపట్నం తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కాగా ప్రమాదానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు.