గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 3 నవంబరు 2021 (19:51 IST)

శ్రీకాకుళంలో దీపావళి బాణసంచా భారీ పేలుడు, పరుగులు తీసిన స్థానికులు

దీపావళి బాణసంచా అక్రమంగా తయారుచేస్తున్న సమయంలో బాణసంచా పేలడంతో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన శ్రీకాకుళం టెక్క‌లిలోని క‌చేరీ వీధిలో చోటుచేసుకుంది. పెద్దపెట్టున భారీ పేలుడు సంభ‌వించడంతో స్థానికులు ఏం జరిగిందో తెలియక బయటకు పరుగులు తీసారు.

 
ఆ తర్వాత ఓ ఇంట్లో నుంచి దట్టమైన పొగ వస్తుండటంతో వెళ్లి చూడగా వారంతా ఇంట్లో అక్ర‌మంగా బాణ‌సంచా త‌యారు చేస్తున్నట్లు కనుగొన్నారు. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ప‌రిస్థితి విష‌మంగా మారింది. వెంటనే వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్సం చేస్తున్నారు. మరోవైపు పేలుడు సంభవించిన ప్రాంతానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.