సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 20 అక్టోబరు 2021 (12:46 IST)

చెరువులో పడిన బస్సు : స్కూలు విద్యార్థిని మృతి

ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదకర ఘటన ఒకటి జరిగింది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం బడివానిపేట సమీపంలోని చెరువులో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ విద్యార్థి చనిపోగా.. నలుగురు పిల్లలకు గాయాలయ్యాయి. బస్సులో మొత్తం ఐదుగురు పిల్లలే ఉన్నారు.
 
ప్రమాద వార్త తెలియగానే స్థానికులంతా ఒక్క పరుగున వచ్చి విద్యార్థులను బయటకు తీశారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన బాలుడు బడివానిపేటకు చెందిన రాజుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బస్సును జేసీబీ సాయంతో చెరువులో నుంచి బయటకు తీశారు.