శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 అక్టోబరు 2021 (16:18 IST)

భావనపాడు సముద్రతీరంలో యువతి మృతదేహం.. ప్రియుడి అరెస్టు

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా భావనపాడు సముద్ర తీర ప్రాంతంలో గుర్తుతెలియని యువతి మృతదేహం కలకలం సృష్టించింది. సంతబొమ్మాళి మండలంలోని ఈ యువతి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. గురువారం అటుగా సుముద్ర తీర ప్రాంతానికి వెళ్లిన స్థానికులు ఈ మృతదేహాన్ని గుర్తించి నౌపాడ పోలీసులకు సమాచారం అందించారు. 
 
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే యువతి విషం తాగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే.. మృతురాలు ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడి ప్రాంతానికి చెందిన యువతిగా నౌపాడ పోలీసులు గుర్తించారు. 
 
ప్రియుడితో కలిసి ఆమె గురువారం భావనపాడు సముద్రతీరానికి వచ్చినట్లు స్థానికులు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో ప్రియుడు, ప్రియురాలి ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో ఆమె విషం తాగినట్లు పేర్కొంటున్నారు. విషం వెంట తెచ్చుకున్న యువతి సమీపంలోని జీడిమామిడి తోటకు వెళ్లి తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ప్రియుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.