గురువారం, 9 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated: సోమవారం, 31 జనవరి 2022 (09:07 IST)

అదుపు తప్పి బీభత్సం సృష్టించిన ఎలక్ట్రిక్ బస్సు - ఐదుగురి మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో ఓ ఎలక్ట్రిక్ బస్సు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి మూడు కార్లు, పలు మోటార్ సైకిళ్లను ఢీకొట్టింది. అంతటితో ఆగని ఈ బస్సు పాదాచారులపైకి కూడా దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. బీభత్సం సృష్టించిన బస్సు చివరకు ఓ లారీని ఢీకొని ఆగింది. 
 
ఈ బస్సు బీభత్స సమాచారం వార్త అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు, ఈ బీభత్సానికి కారణమైన బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన కాన్పూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.