ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 10 జనవరి 2022 (15:26 IST)

కృత్రిమ గుండెను తయారుచేస్తున్న ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు

గుండెను ప్రయోగశాలలో తయారుచేసేందుకు కృషి చేస్తున్నారు ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు. ఈ మేరకు ఐఐటీ కాన్పూర్ ఓ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అవసరమైన ప్రక్రియ ప్రారంభించింది. 
 
వైద్య రంగంలో ఐఐటీ కాన్పూర్ చేసిన విశేష కృషిని చర్చించేందుకు తాజాగా ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలోనే కృత్రిమ గుండె తయారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.
 
ఈ టాస్క్ ఫోర్స్‌లో ఐఐటీ ప్రొఫెసర్లు, అమెరికా వైద్య నిపుణులు, ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, మేదాంత వైద్య సంస్థలకు చెందిన అనుభవజ్ఞులైన వైద్యులు ఉన్నారు. ఈ కృత్రిమ గుండెకు లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైస్ (ఎల్వీఏడీ)గా నామకరణం చేశారు.