ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 28 డిశెంబరు 2021 (17:07 IST)

కాన్పూరులో ప్రధాని మోడీ మెట్రో జర్నీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాన్పూరు పర్యటనలో మెట్రో రైలులో ప్రయాణించారు. ఆయన వెంట యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సింగ్‌తో పాటు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. 
 
అంతకుముందు ఆయన కాన్పూర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్ సెక్షన్, బినా - పంకీ మల్టీ ప్రోడక్ట్ పైప్‌లేన్ ప్రాజెక్టులను ప్రధాని మోడీ ప్రారంభించారు. అలాగే, 32 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టును రూ.11 వేల కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు. 
 
దేశ ప్రధానమంత్రిగా మోడీ  దృష్టిసారిస్తున్న అంశాల్లో అర్బన్ మొబిలిటీ ఒకటని, ఆ దిశగా కాన్పూర్ రైల్ ప్రాజెక్టు మరో ముందడుగని పీఎంవో విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది.