శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (08:50 IST)

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో చెర్రీ సతీమణి ఉపాసన భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సతీమణి, అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్‌పర్సన్ కొణిదెల ఉపాసన సమావేశమయ్యారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోను ఆమె తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ మేరకు ఆమె "ఇండియన్ ఎక్స్‌పో 2020"లో భాగంగా ప్రధానితో భేటీ అయినట్టు ఆమె వివరిచారు. 
 
'ఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌పో 2020' కార్యక్రమం జరిగింది. "ఆవిష్కరణలు, ఆరోగ్య పరిరక్షణను మరింత మెరుగుపరచడం, మహిళా సాధికారత, సంస్కృతీ పరిరక్షణ వంటి అశాలపై ప్రధానంగా దృష్టిసారించడం అనేవి అద్భుతమైన అంశాలు. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది. మనం దానిని తెలివిగా ఉపయోగించుకోవాలి" అని ఆమె ట్వీట్ చేశారు.