గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 డిశెంబరు 2021 (08:02 IST)

నేడు కేంద్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం : మళ్లీ లాక్డౌన్?

దేశంలో ఒమిక్రాన్ వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. దీంతో కేంద్రమంత్రివర్గం గురువారం అత్యవసరంగా సమావేశంకానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరుగనుంది. ఇందులో మళ్లీ దేశంలో లాక్డౌన్ విధించే అంశాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
 
సౌతాఫ్రికాలో పురుడు పోసుకున్న ఒమిక్రాన్ వైరస్ ఇపుడు ప్రపంచ దేశాలను వణికిస్తుంది. అలాగే, భారత్‌లోని పలు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నాయి. ఇది తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. 
 
ముఖ్యంగా కరోనా మొదటి, రెండో వేవ్ సృష్టించిన నష్టం నుంచి ఇప్పుడిపుడే కోలుకుంటుంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి చెందకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై చర్చించేందుకు మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమవుతుంది. 
 
గురువారం ఉదయానికి దేశవ్యాప్తంగా 213 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. 15 రాష్ట్రాలకు ఈ వైరస్ వ్యాపించింది. దేశ రాజధాని ఢిల్లీలో 57 కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలో 54, తెలంగాణాలో 24, కర్నాటకలో 19, రాజస్థాన్‌లో 19, కేరళలో 15, గుజరాత్‌లో 14 ఇలా మొత్తం 15 రాష్ట్రాల్లో 213 ఒమిక్రాన్ కేసులు నమోదైవున్నాయి. ఈ వైరస్ సోకినవారిలో 90 మంది ఇప్పటివరకు కోలుకున్నట్టు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.