సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (22:46 IST)

వాగులో పడిన ఆర్టీసీ బస్సు, ప్రధాని, సీఎం ఎక్స్‌‍గ్రేషియా ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలోని జంగారెడ్డి గూడెం సమీపంలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జల్లేరు వాగులోకి దూసుకెళ్లి 9 మంది ప్రయాణికులు మృతిచెందిన సంగతి తెలిసిందే. బస్సు వాగులో పడిన సమయంలో 47 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 
 
బస్సు ప్రమాదంపై ప్రధాని తీవ్ర దిగ్ర్భాంతికి గురైనట్లు తెలిపారు. అంతేగాకుండా.. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.  
 
కాగా, ఇప్పటికే ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అధికారులను ఆదేశించారు.