శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (17:04 IST)

బహుళ అనుసంధానం లక్ష్యంగా పీఎం గతిశక్తి ఆవిష్కరణ : ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా బహుళ అనుసంధానం లక్ష్యంగా ‘ప్రధానమంత్రి గతిశక్తి’ కార్యక్రమాన్ని పీఎం నరేంద్ర మోడీ ప్రగతి మైదానంలో బుధవారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికను ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, ఈ ప్రణాళిక ‘ఆత్మనిర్భర్ భారత్’ పథకంలో ముఖ్యమైన భాగమన్నారు. ఈ ప్రాజెక్టు కింద రూ.100 లక్షల కోట్ల విలువైన ప్రణాళిక రూపొందించనట్లు తెలిపారు. 
 
1.5 ట్రిలియన్ డాలర్ల జాతీయ మౌళిక సదుపాయలకు సంబంధించి ప్రాజెక్టులకు మరింత శక్తిని అందించనుందన్నారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావం చూపిందన్నారు.
 
దేశంలో లాజిస్టిక్ ఖర్చులను తగ్గించడం, సరుకు నిర్వహణ సామర్థ్యాన్ని పెంచడమే ‘ప్రధాన మంత్రి గతిశక్తి’ లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు.