ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Updated :విజ‌య‌వాడ‌ , శనివారం, 4 డిశెంబరు 2021 (19:01 IST)

మేఘా ఇంజినీరింగ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఎలక్ట్రిక్ బస్సులు

విద్యుత్తు వాహనాల తయారీలో అగ్రగామి, మేఘా ఇంజినీరింగ్ అనుబంధ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ లిమిటెడ్ సంస్థకు చెందిన బస్సులను గోవా రాష్ట్రంలో ప్రారంభించారు. శనివారం కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా జెండా ఊపి బ‌స్సుల‌ను లాంఛనంగా కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే ప్రారంభించారు. 
 
 
ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణపై రూపొందించాల్సిన విధి విధానాలపై గోవా రాష్ట్రంలోని లాలిట్ గోల్ఫ్,  స్పా రిసార్ట్, కెనకోనాలో కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  రౌండ్ టేబుల్ నిర్వ‌హించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. 

 
ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్తు వాహనాల తయారీ పై వివిధ ప్రోత్సాహకాలు అందిస్తున్న దృష్ట్యా దేశంలోనే అతి పెద్ద వాహనాల తయారీ యూనిట్ ను 300 కోట్ల పెట్టుబడితో రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపూర్ లో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లాంట్ ను అతి తక్కువ మానవ ప్రమేయం, పూర్తిస్థాయి ఆటోమేషన్ మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీతో నెలకొల్పనున్నారు. బస్సుల‌తో పాటు త్రివీలర్స్, ట్రక్కులు, ఇతర వాహనాలు కూడా తయారు చేయనున్నారు.