సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (13:13 IST)

హైదరాబాద్ నగర శివారుల్లో పేలుడు - మహిళ మృతి

హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆనంద్ నగరులో జరిగింది. ఇక్కడ ఉన్న ఓ చెత్త కుండీలో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. 
 
ఆనంద్ నగర్‌లో చెత్త సేకరించేందుకు రంగముని సుశీలమ్మ, ఆమె భర్త ఆనంద్ నగర్ పారిశ్రామికవాడలకు ఉదయం ఆటోలో వెళ్లారు. అయితే, చెత్త సేకరిస్తుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో సుశీలమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త రంగముని తీవ్రగాయలపాలయ్యాయి.