గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 ఫిబ్రవరి 2022 (11:41 IST)

పశ్చిమ ఆఫ్రికాలోని బంగారు గనిలో భారీ పేలుడు... 59 మంది మృతి

పశ్చిమ ఆఫ్రికా దేశంలోని బుర్కినా ఫాస్కోలో ఓ బంగారు గనిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 59 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. మరో వంద మంది వరకు తీవ్రంగా గాయపడినట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ గనిలో బంగారాన్ని శుద్ధిచేసేందుకు ఉపయోగించే రసాయనాల వల్లే ఈ పేలుడు సంభవించినట్టు సమాచారం. 
 
కాగా, ఈ భారీ పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. కాగా, ఆఫ్రికాలో బంగారాన్ని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతాల్లో బుర్కినా ఫాసో ఒకటి. ఇక్కడ ఉన్న బంగారు గనుల్లో సుమారు 10.5 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇక్కడ తొలి పేలుడు రాత్రి 2 గంటల సమయంలో జరిగింది. 
 
Gold mining blast in Burkina Faso kills 59, injures more than 100
Gold Mine, Blast, Burkina Faso, Injuries