బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (19:26 IST)

విదేశీయులు ఇండియా వీసాల కోసం ఎగబడాలె: కేసీఆర్ వ్యాఖ్యలు

అమెరికా వెళ్లేందుకు మన దేశం నుంచి యువత వీసాలు తీసుకునేందుకు ఎంతగా ప్రయత్నిస్తుంటారో అదే రీతిన మన దేశానికి వచ్చేందుకు వీసాల కోసం విదేశీయులు ఎగబడేట్లు చేస్తామన్నారు కేసీఆర్. తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా బంగారు తెలంగాణగా మార్చానో అలాగే భారతదేశాన్ని బంగారు భారతదేశంగా మార్చుతామని అన్నారు.

 
తెలంగాణ అభివృద్ధి కోసం కొట్లాడామనీ, ఇప్పుడు భారతదేశం అభివృద్ది కోసం కొట్లాడేందుకు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతున్నట్లు తెలిపారు. మన దేశంలో అపారమైన వనరులున్నాయనీ, యువత శక్తితో భారతదేశాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. అమెరికా కంటే ధనవంతమైన దేశంగా మార్చుతామనీ, ఇతర దేశీయులు మనదేశ వీసాల కోసం ఎగబడేట్లు చేస్తామని చెప్పారు.