బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 21 ఫిబ్రవరి 2022 (10:35 IST)

దేశంలో మరింతగా తగ్గిన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింతగా తగ్గాయి. నిజానికి గత 20 రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి, కొత్తగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా తగ్గిపోతున్న విషయంతెల్సిందే. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,051 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,28,38,524కు చేరింది. అలాగే, 206 మంది చనిపోయారు. తాజాగా చనిపోయిన మృతులతో కలుపుకుంటే కరోనా కారణంగా ప్రాణాలతో కోల్పోయిన వారి సంఖ్య 5,12,109కు చేరింది. అలాగే, గత 24 గంటల్లో 37,901 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఇక దేశ వ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 4,21,24,284గా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 2,02,131కు చేరుకుంది.