శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 20 ఫిబ్రవరి 2022 (10:58 IST)

20 వేలకు దిగువకు చేరుకున్న కరోనా వైరస్ పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి బాగా తగ్గిపోతుంది. గడిచిన 24 గంటల్లో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 20 వేలకు దిగువుగా ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటన మేరకు గత 24 గంటల్లో మొత్తం 19,968 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే, 673 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఇందులో రోజువారీ పాజిటివిటీ రేటు 1.68 శాతంగా ఉంది. తాజాగా నమోదైన మృతులతో కలుసుకుంటే ఇప్పటివరకు కరోనా కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 5,11,903గా వుంది. అలాగే, హోం క్వారంటైన్లలో 2,24,187 మంది ఉన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు 175,37,22,697గా కరోనా వ్యాక్సిన్ డోసులను వినియోగించారు.