గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 ఫిబ్రవరి 2022 (12:00 IST)

ఈశాన్య చైనాలో పేలిన బస్సు - ఒకరి మృతి - 42 మందికి గాయాలు

ఈశాన్య చైనాలో ఓ బస్సు ఉన్నట్టుండి పేలిపోయింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదం శనివారం జరిగింది. 
 
లియానింగ్ ప్రావిన్స్‌లోని షెన్యాంగ్ నగరంలో ఈ పేలుడు జరిగింది. బస్సులో ఉన్నట్టుండి పెద్ద శబ్దంతో పేలుడు జరిగిందని, కానీ, మంటలు మాత్రం చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా మరో 42 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పబ్లిక్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. 40 మందికి మాత్రం స్వల్పంగా గాయాలైనట్టు అధికారులు పేర్కొన్నారు.