1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. passengers Narrow escape from RTC bus catches fire

ఆర్టీసీ బస్సులో పొగలు.. ప్రాణభయంతో ప్రయాణికుల పరుగో పరుగు

East Godavari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలో ప్రభుత్వ రవాణా సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులో ఉన్నట్టుండి దట్టమైన పగలు ఒక్కసారిగా వచ్చాయి. ఈ బస్సు ధవళేశ్వరం వంతెనపై వెళుతుండగా పొగలు వచ్చాయి. 
 
బస్సులో షార్ట్‌సర్క్యూట్‌తో పొగలు వచ్చినట్లు సిబ్బంది తెలిపారు. పొగలు వచ్చిన విషయాన్ని గమనించిన డ్రైవర్‌ బస్సును నిలిపివేయడంతో ప్రయాణికులు వెంటనే కిందికి పరుగులు తీశారు. దీంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. బస్సు కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
తర్వాతి కథనం
నాలుగేళ్ళ చిన్నారి అత్యాచారం కేసులో ఐదు రోజుల్లో కోర్టు తీర్పు