కొవ్వూరులో దాఖలైన నామినేషన్లు... స్వీకరణ పూర్తి
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో స్థానిక ఎన్నికల హడావుడి పతాక స్థాయికి చేరింది. ఇక్కడ స్థానిక అభ్యర్తులు జోరుగా తమ నామినేషన్లను దాఖలు చేశారు. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పోటీపడుతున్నాయి. ఇంకా కొందరు ఇండిపెండెంట్లు కూడా పోటీకి దిగి తిరిగి విరమించుకుంటున్నారు.
కొవ్వూరు మునిసిపాలిటీ పరిధిలోని 23వ వార్డుకి శుక్రవారం సాయంత్రం 3 గంటలతో నామినేషన్లు స్వీకరణ పూర్తి అయిందని మునిసిపల్ కమిషనర్ టి. రవికుమార్ తెలిపారు. వైఎస్సార్ పార్టీ తరపున రెండు, టిడిపి తరపున మూడు, సిపిఎం తరపున రెండు, బీజేపీ తరపున ఒకటి, జనసేన తరపున ఒక నామినేషన్ దాఖలు అయ్యాయని తెలిపారు. నవంబర్ 6న నామినేషన్లు పరిశీలన చేస్తామని, 8వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ కు మ.3 గంటల వరకు గడువు ఉందన్నారు.
అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుది జాబితాను 8వ తేదీన ప్రకటిస్తామన్నారు. 15వ తేదీ ఉదయం 7 నుండి సా.5 వరకు పోలింగ్ జరుగుతుందని, ఒకవేళ రిపోలింగ్ నిర్వహించాల్సి వస్తే, 16 వతేదీ రిపోలింగ్ చేపడతారని పేర్కొన్నారు. నవంబర్ 17 వ తేదీ ఓట్ల లెక్కింపు జరుగుతుందని ఆయన తెలిపారు.