గురువారం, 29 ఫిబ్రవరి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (10:44 IST)

ఫ్లైట్‌లో ప్రయాణికుడి మొబైల్ నుంచి పొగలు ... సురక్షితంగా ఫ్లైట్ ల్యాండింగ్

indigo
డిబ్రూగఢ్‌ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానంలో ప్రయాణించే ప్రయాణికుడి వద్ద ఉన్న ఫోను నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇది గమనించిన విమాన సిబ్బంది వేగంగా స్పందించి ఆ పొగలను ఆర్పివేశాయి. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత విమానం సురక్షితంగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. 
 
కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల మేరకు ఇండిగో సంస్థకు చెందిన 6ఈ2037 అనే విమానం అస్సోంలోని డిబ్రూగఢ్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. ఈ విమానంలో ప్రయాణిస్తున్న ఓ ప్యాసింజర్ ఫోన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 
 
ఇది చూసిన సాటి ప్రయాణికులు భయంతో వణికిపోయారు. వెంటనే అప్రమత్తమైన క్యాబిన్ క్రూ సిబ్బంది అగ్నిమాపక యంత్రాల సాయంతో మంటలను ఆర్పివేశాయి. దీంతో గగనతలంలో పెను ప్రమాదం తప్పింది. ఆ తర్వాత విమానం సురక్షితంగా ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.