గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 27 మే 2022 (14:55 IST)

వరంగల్ చౌరస్తాలోని రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం

fire accident
జిల్లా కేంద్రమైన వరంగల్‌లోని ఓ రెస్టారెంట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. చౌరస్తాలోని ఓ మను అనే ఫుడ్ రెస్టారెంట్‌లో శుక్రవారం ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించింది. అవి క్రమంగా రెస్టారెంట్ మొత్తానికి వస్తరించాయి. దీంతో భారీ మంటలు ఒక్కసారిగా రెస్టారెంట్‌కు వ్యాపించాయి. ఫలితంగా మూడు షాపులు దగ్ధమైపోయాయి. 
 
ఈ అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పివేశాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.