గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మే 2022 (09:30 IST)

అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం : వృద్ధుడు సజీవదహనం

fire accident
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావు పేటలో అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉండే వడ్డెర బజారులో ఈ ప్రమాదం జరిగింది. ఆదివారం రోజు ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్న ఓ గుడిసెలో వెలిగించిన కొవ్వొత్తి ద్వారా మంటలు వ్యాపించాయి. ఈ మంటలు ఒక్కసారిగా పెద్దవి కావడంతో ఆ గుడిసెలో ఉన్న వృద్ధుడు ఒకడు సజీవదహనమయ్యాడు. 
 
అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వృద్ధుడిని పెద్దభిక్షం (80)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.