శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 26 ఏప్రియల్ 2022 (09:37 IST)

కేటీపీపీలో భారీ అగ్నిప్రమాదం - కొందరికి గాయాలు

ktpp
తెలంగాణ రాష్ట్రంలోని భూపాలపల్లి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్‌ (కేటీపీపీ)లో సోమవారం రాత్రి భారీ ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లో జరిగిన పేలుడు కారణంగా ఇద్దరు కేటీపీపీ ఉద్యోగులతో పాటు మొత్తం ఐదుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే తక్షణం స్పందించిన అధికారులు గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. 
 
భూపాలపల్లి కేటీపీసీలో 500 మెగా యూనిట్ల ఉత్తత్తి కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌ పంపించే మిల్లులో ఉండే ఆక్సిజన్ సిలిండర్లు ఉన్నట్టుండి పేలిపోయాయి. ఈ పేలుడు కారణంగా ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఓ వైపు మంటలలను అదుపు చేసే పనిని కూడా చేపట్టిన అధికారులు, మరోవైపు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.