బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 25 ఏప్రియల్ 2022 (08:22 IST)

శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం - ముగ్గురి దుర్మరణం

road accident
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ ఆలయాన్ని దర్శించుకుని టెంపోలో తిరిగి తిరుపతికి బయలుదేరారు. ఈ క్రమంలో రేణిగుంట - నాయుడుపేట ప్రధాన రహదారిపై శ్రీకాళహస్తి అర్థనారీశ్వరస్వామి ఆలయం సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ వీరి వాహనాన్ని ఢీకొట్టింది. 
 
ఈ ప్రమాదంలో అర్జునయ్య, సరసమ్మ దంపతులతో పాటు కావ్య అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గోపి, ఢిల్లీ రాణి, కవిత, ఆనంద్, శ్రీనివాసులతో పాటు నలుగురు చిన్నారులు భవీఫ్, ధరణి, మోక్షిత, ధనుష్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు, టెంపో వ్యాను డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.