బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 23 ఏప్రియల్ 2022 (16:56 IST)

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌ విద్యార్థులు మృతి

road accident
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాదుకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. చికాగో సమీపంలోని అలెగ్జాండర్‌ కౌంటీ వద్ద గురువారం తెల్లవారుజామున 4.15 గంటలకు ఈ ఘటన జరిగింది. 
 
పిక్నిక్‌కు వెళ్తున్న విద్యార్థుల కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నిజాంపేటలో నివాసముండే జేఎన్‌టీయూ ప్రొఫెసర్‌ పద్మజా రాణి చిన్న కుమారుడు పీచెట్టి వంశీకృష్ణ(23), అతని స్నేహితుడు పవన్‌ స్వర్ణ(23) అక్కడికక్కడే మృతి చెందారు. 
 
అదే కారులో ఉన్న వారి స్నేహితులు డి.కల్యాణ్‌, కె.కార్తీక్‌, ఉప్పలపాటి శ్రీకాంత్‌లకు గాయాలయ్యాయి. చికాగోలోని ఓ ఆస్పత్రిలో క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.