ఇలాంటి వారు బతికి వున్నా మరణించినవారితో సమానం...
మనుషులు రకరకాలుగా వుంటారు. ఐతే ఒక్కో మనిషి ప్రత్యేకత ఒక్కో విధంగా వుంటుంది. కానీ కొందరిని మాత్రం పెద్దలు తరచి తరచి చూసి సూక్తులు వల్లించారు. ఆ లక్షణాలు కలిగిన వ్యక్తులు బతికి వున్నా మరణించినవారితో సమానం అని చెప్పారు. ఇంతకీ వారు ఎలాంటివారు... చూద్దాం.
స్త్రీ ధనంతో జీవించేవాడు బ్రతికి వున్నా మరణించినవాడితో సమానం. ఇంకా... ఎల్లప్పుడూ ఇంట్లోనే వుండేవారు, సభలో భంగపడినవారు, తీరని దుఃఖాన్ని అనుభవించువారు అలాంటివారే.
అర్థించిన వారికి ఉపకారం చేయనివారు, సమాజానికి కీడు చేసేవారు, రహస్యమైన పని రచ్చకు తెచ్చేవారు, ఎడతెగని దారిద్ర్యాన్ని అనుభవించువారు, తీరని రోగంతో బాధపడేవారు బతికి వున్నప్పటికీ మరణించినవారితో సమానం.