గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:10 IST)

హైతీలో ఘోరం - పెట్రోల్ ట్యాంకర్ పేలి 50 మంది సజీవ దహనం

హైతీలోని క్యాప్ హైటియన్ నగరంలో ఘోరం జరిగింది. గ్యాస్ ట్యాంకర్ ఒటి పేలడంతో ఏకంగా 50 మంది సజీవదహనమయ్యారు. ఈ మృతులను గుర్తించడం కూడా సాధ్యపడలేదు. ప్రమాద స్థలంలో ఒక శవాలతో శ్మశానంగా మారిపోయింది. 
 
దీనిపై ఆ నగర డిప్యూటీ మేచర్ పాట్రిక్ అల్మోనోర్ స్పందిస్తూ, హైటియన్ నగరంలో ఈ గ్యాస్ ట్యాంకర్ పేలిందని చెప్పారు. ఈ ప్రమాద స్థలంలో 50 నుంచి 54 వరకు సజీవంగా దహనమవడం చూశామని తెలిపారు. 
 
అలాగే, ప్రమాద స్థలానికి సమీపంలో ఉన్న అనేక గృహాలు కూడా కాలిపోయాయి. మృతులను గుర్తించడం, వారి వివరాలను తెలుసుకోవడం కష్టసాధ్యంగా మారిందని ఆయన చెప్పారు. ఇటీవల హైతీ దేశంలో కొన్ని ముఠాలు గ్యాప్ పైప్ లైన్లను స్వాధీనం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ ఇంధన కొరత ఏర్పడింది.