సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 15 మార్చి 2022 (20:11 IST)

అయ్యో... ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి సజీవ దగ్ధమైంది...

పగలంతా వళ్లంతా అలసిపోయేట్లు పనిచేసి హాయిగా సేదతీరారు ఆ దంపతులు తమ కుమారిడితో సహా. ఐతే అర్థరాత్రి వున్నట్లుండి వారిపైకి అగ్నికీలలు వచ్చిపడ్డాయి. నిద్రలేచి తేరుకునేలోపే ఇంట్లో దీపం పెట్టే ఇల్లాలు అగ్నికి ఆహుతైంది.

 
పూర్తి వివరాలు చూస్తే... తెలంగాణలోని మెదక్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో నర్సింహులు అతడి భార్య మంగమ్మ, వారి కొడుకు నివాసం వుంటున్నారు. నిన్న రాత్రి అంతా ఇంట్లో నిద్రపోతున్నారు. అర్థరాత్రి దాటాక ఇంట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది. పూరిల్లు కావడంతో ఇంటిని క్షణాల్లో అగ్ని చుట్టుముట్టింది.

 
ఏం జరిగిందో తెలుసుకునేలోపే వారిని మంటలు చుట్టుముట్టాయి. హాహాకారాలు విని పొరుగుంటి వారు వచ్చి వారిని కాపాడే ప్రయత్నం చేసారు. నర్సింహులు, అతడి కుమారుడిని ఎలాగో బయటకు లాగారు కానీ నర్సింహులు భార్య మంగమ్మను మాత్రం కాపాడలేకపోయారు. ఆమె మంటల్లో చిక్కుకుని సజీవంగా దహనమైంది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.